దుబాయ్: టీమ్ఇండియా మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన ఐసీసీ ర్యాంకులలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. ఇప్పటికే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న మంధాన.. తాజాగా టీ20 ర్యాంకులలోనూ టాప్-3కు దూసుకొచ్చింది.
ఇంగ్లండ్తో ముగిసిన తొలి టీ20లో శతకం బాదిన మంధాన.. ఒకస్థానాన్ని మెరుగుపరుచుకుని మూడో స్థానానికి ఎగబాకింది. ఆసీస్ బ్యాటర్ బెత్ మూనీ 794 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన కొనసాగుతుండగా విండీస్ అమ్మాయి హీలీ మాథ్యూస్ (774) రెండో స్థానంలో ఉంది. మంధాన 771 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.