Cricket World Cup | అహ్మదాబాద్ : ప్రస్తుత వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో స్టేడియంకు హాజరైన ప్రేక్షకుల సంఖ్య ఇప్పటికే పది లక్షలు దాటిందని ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ నిర్వహించిన టోర్నీలలో ఇదే అత్యధిక హాజరు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో శుక్రవారం దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ఈ రికార్డు నమోదైనట్టు ఐసీసీ తెలిపింది.
ప్రస్తుత మెగాటోర్నీ డిజిటల్ వీక్షకుల సంఖ్యలో రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. మరో మూడు లీగ్ మ్యాచ్‌లు, మూడు నాకౌట్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ రికార్డు నమోదైందని, టోర్నీ ముగిసేసరికి మరిన్ని రికార్డు నమోదయ్యే అవకాశం ఉందని ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లే అన్నారు.