PAK vs NED | వన్డే ప్రపంచకప్ (ICC World Cup 2023)లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ (Hyderabad) ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పాకిస్థాన్ (Pakistan), నెదర్లాండ్స్ మధ్య టోర్నీ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన నెదర్లాండ్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పాక్ బ్యాటింగ్ చేయనుంది.
ఆసియాకప్ 2023లో పేవల ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయిన పాకిస్థాన్.. వన్డే ప్రపంచకప్‌కు ముందు జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లోనూ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం పాక్ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆరంభ పోరు పసికూన నెదర్లాండ్స్‌తో కావడంతో మొదటి మ్యాచ్ గెలుపుపై భారీ ఆశలు పెట్టుకుంది.
పాకిస్థాన్ జట్టు..
ఇమామ్-ఉల్-హక్, ఫఖర్ జమాన్, బాబర్ అజాం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్
నెదర్లాండ్స్ జట్టు..
విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్
Also Read..
Viral video | లైవ్ క్లాస్‌లో ఉపాధ్యాయుడిని చెప్పుతో కొట్టిన విద్యార్థి.. వీడియో
Ms Dhoni | జియోమార్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ
Air India | విమానంలో తోటి ప్రయాణికులు, క్రూ సిబ్బంది పట్ల అసభ్యకర ప్రవర్తన.. వ్యక్తి అరెస్ట్