Air India | విమానంలో తోటి ప్రయాణికులు, క్రూ సిబ్బంది పట్ల అసభ్యకర ప్రవర్తన.. వ్యక్తి అరెస్ట్
Air India | విమానాల్లో కొందరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు ఇటీవలే తరచూ చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.
Air India | విమానాల్లో కొందరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు ఇటీవలే తరచూ చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ (New York-Delhi)కి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం (Air India flight)లో ఓ వ్యక్తి తోటి ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది (cabin crew ) పట్ల దురుసుగా ప్రవర్తించాడు.
పంజాబ్(Punjab) లోని జలంధర్ (Jalandhar)కి చెందిన అభినవ్ శర్మ (Abhinav Sharma) గత ఆదివారం న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు. ఈ క్రమంలో తోటి ప్రయాణికులపై దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రశ్నించిన విమాన సిబ్బందితో దురుసుగా వ్యవహరించాడు. క్యాబిన్ సూపర్ వైజర్ అతన్ని హెచ్చరించగా.. ఆమెను పరుష పదజాలంత తిడుతూ హెచ్చరించాడు.
ఫ్లైట్ ఢిల్లీలో ల్యాండ్ కాగానే సదరు ప్రయాణికుడిపై క్యాబిన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. కాగా, విమానాల్లో తరూచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Viral video | లైవ్ క్లాస్‌లో ఉపాధ్యాయుడిని చెప్పుతో కొట్టిన విద్యార్థి.. వీడియో
Ms Dhoni | జియోమార్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ
Elections | మరో రెండు రోజుల్లో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

