Viral video | ఫిజిక్స్ వాలా యాప్ (Physics Wallah App)లోని లైవ్ క్లాస్‌లో ఉపాధ్యాయుడిని ఓ విద్యార్థి చెప్పుతో కొట్టాడు (Students slipper attack ). ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (ఎక్స్)లో వైరల్ అవుతోంది.
వీడియోలో ఏముందంటే.. ఫిజిక్స్ వాలా యాప్‌లో ఓ ఉపాధ్యాయుడు (Physics Wallah Teacher) లైవ్ క్లాస్ నిర్వహిస్తుంటాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఓ విద్యార్థి ఉపాధ్యాయుడి వద్దకు వచ్చి చెప్పుతో కొట్టసాగతాడు. ఊహించని ఈ ఘటనతో సదరు ఉపాధ్యాయుడు షాక్ అవుతాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు విద్యార్థి చర్యకు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
In Live Class Student Slaps Physics Wallah Teacher With A Slipper.#teachersday2023 #TeachersDay #StudentsProtest#teacher #TEACHers #TeacherDay #Physicswallah pic.twitter.com/FDDuYgTobC
— Aanchal (@SweetLilQueen) October 6, 2023
కాగా, ఫిజిక్స్ వాలా యాప్‌ను ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన విద్యావేత్త అలఖ్ పాండే 2016లో స్థాపించారు. సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ మహేశ్వరితో కలిసి ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET), జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ యాప్‌ను రూపొందించారు. నీట్ (NEET), గేట్ (GATE) , ఎస్ఎస్సీ (SSC) , యూపీఎస్సీ (UPSC) , పీఎస్సీ (PSC), సీఏ (CA) తదితర పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు విద్యాపరమైన కంటెంట్‌ను అందిస్తున్నారు. ఈ యాప్‌కు మంచి ఆదరణ లభించింది.
Also Read..
Ms Dhoni | జియోమార్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ
Elections | మరో రెండు రోజుల్లో ఆ ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్..?
Sikkim Floods | సిక్కింలో క్లౌడ్ బస్ట్.. 80 శాతం ప్రభావితం