ICC : భారత్‌లో త్వరలో మొదలయ్యే పొట్టి ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆడడంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఐసీసీ (ICC) నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని బీసీసీఐ (BCCI) స్పష్టం చేయడంతో వేదిక మార్పు తప్పదేమో? అనిపించింది. కానీ, ఇండియాలోనే ప్రపంచకప్ ఆడేలా బంగ్లాదేశ్ బోర్డును ఒప్పించేందుకు ఐసీసీ పావులు కదుపుతోంది. ఈ మేరకు భారత్‌లో వరల్డ్‌కప్ ఆడబోమనే నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని ఐసీసీ తమను కోరిందని మంగళవారం బీసీబీ వెల్లడించింది.
టీ20 ప్రపంచకప్ కోసం ఇండియాకు తమ జట్టును పంపబోమని బంగ్లాదేశ్ బోర్డు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఐసీసీ రంగంలోకి దిగింది. ఎలాగైనా బీసీబీ తమ నిర్ణయాన్ని మార్చుకునేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. మంగళవారం బీసీబీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది ఐసీసీ. ‘ఈ సందర్భంగా ఇదివరకు చెప్పినట్టుగానే భద్రతా కారణాల రీత్యా భారత్‌కు తమ జట్టును పంపబోమని బంగ్లాదేశ్ బోర్డు చెప్పింది. భారత్‌లో కాకుండా ఇతర దేశాల్లో తమ జట్టు మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ కోరింది.
🚨 JUST IN: ICC has urged Bangladesh Cricket Board to reconsider their position on their participation in the ICC T20 World Cup
During the video-conference, the BCB reaffirmed its stance of not travelling to India for security reasons
Discussions will continue amongst the two… pic.twitter.com/dW4uBLHshp
— Cricbuzz (@cricbuzz) January 13, 2026
అయితే.. ఐసీసీ మాత్రం అందుకు సిద్ధంగా లేదనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించినందున నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరింది. అయితే.. మా బోర్డు సభ్యులం మాత్రం అందుకు అంగీకరించలేదు. అయితే.. పరిష్కారం లభించేంతవరకూ చర్చలు జరపాలని ఐసీసీ, బీసీబీ అనుకుంటున్నాయి. బంగ్లా క్రికెటర్ల భద్రతకు బీసీబీ కట్టుబడి ఉంది. ఈ విషయమై అధికారులు, సిబ్బంది ఐసీసీతో సంప్రదింపులు జరుపుతున్నారు’ అని బీసీబీ తెలిపింది.
‘ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం మా జట్టును ఇండియా పంపించమ’ని ఐసీసీకి బంగ్లా బోర్డు లేఖ రాయడంతో మొదలైన సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. ఐసీసీ జోక్యం చేసుకుంటుందా? లేదంటే శ్రీలంకలో బంగ్లా జట్టు మ్యాచ్‌లు ఆడిపిస్తారా? అనేది తెలియడం లేదు.ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devajit Saikia) కీలక వ్యాఖ్యలు చేశాడు. తమకు ఐసీసీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని అన్నాడు. ‘టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జట్టు మ్యాచ్‌ల వేదికల మార్పు గురించి ఐసీసీ నుంచి మాకు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదు. చెన్నైలో లేదంటే ఇతర వేదికల్లో ఆ టీమ్‌ను ఆడించాలా? అనే విషయంపై ఇంకా ఐసీసీ ఏమీ తేల్చలేదు. ఈ అంశం మా పరిధిలో లేనిది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఐసీసీకి సంబంధించిన విషయమిది. ఒకవేళ ఐసీసీ తప్పనిసరిగా వేదికలను మార్చాలని మాకు చెబితే ఆతిథ్య దేశంగా అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికైతే షెడ్యూల్లో మార్పులేమీ లేవు’ అని సైకియా వెల్లడించాడు.
https://t.co/2qsOE3dH8B ICC asks Bangladesh to reconsider to play T20 World Cup in India, BCB remains hell-bent –
ICC asks Bangladesh to reconsider to play T20 World Cup in India, BCB remains hell-bent. (Photo Source:… pic.twitter.com/oCF2hraNFf
— IndianPremierLeague (@CricketT20IPL) January 13, 2026
పొట్టి ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ గ్రూప్ సీలో ఉంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు కోల్‌కతాలో మూడు లీగ్ మ్యాచ్‌లు ఆడాలి. ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో, ఫిబ్రవరి 8న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లండ్‌తో లిటన్ దాస్ సేన తలపడాలి. కానీ, తాజా ఉద్రికత్తల నేపథ్యంలో బంగ్లాదేశ్ బోర్డు తమ జట్టును భారత్‌కు పంపేందుకు సుముఖంగా లేదు. ఒకవేళ ఐసీసీ చెప్పినా బంగ్లా బోర్డు వినకుంటే.. కో-హోస్ట్ అయిన శ్రీలంకకు ఆ