ICC Under 19 World Cup 2024: కివీస్‌ను కుమ్మేసిన కుర్రాళ్లు.. ఎదురులేని భారత్..
ICC Under 19 World Cup 2024: ఐసీసీ అండర్ - 19 వరల్డ్ కప్‌లో ఓటమనేదే లేకుండా ఆడుతున్న భారత్.. సూపర్ సిక్స్‌లోనూ ఇరగదీస్తున్నది. కివీస్‌తో జరిగిన సూపర్ సిక్స్ పోరులోనూ జయకేతనం ఎగురవేసింది.
ICC Under 19 World Cup 2024: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్‌లో భారత కుర్రాళ్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఓటమనేదే లేకుండా ఆడుతున్న భారత్.. సూపర్ సిక్స్‌లోనూ ఇరగదీస్తున్నది. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయాలు సొంతం చేసుకున్న భారత్.. తాజాగా కివీస్‌తో జరిగిన సూపర్ సిక్స్ పోరులోనూ జయకేతనం ఎగురవేసింది. సూపర్ సిక్స్ స్టేజ్‌లో కివీస్‌తో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 295 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్.. 81 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా యువ భారత్.. 214 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారత బ్యాటర్ ముషీర్ ఖాన్ (131) సెంచరీతో చెలరేగాడు. బౌలర్లలో సౌమి పాండే 4 వికెట్లు తీశాడు.
ఛేదనలో కివీస్ బ్యాటర్లు ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును చేరుకోలేదు. కెప్టెన్ ఆస్కార్ జాక్సన్ 19 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ జట్టులో నలుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే పరిమితమవగా ముగ్గురు సింగిల్ డిజిట్ స్కోరు చేశారు. నలుగురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు.
India were in sensational form in their #U19WorldCup 2024 Super Six fixture against New Zealand 👌#INDvNZ pic.twitter.com/OFqxdsZwh6
— ICC (@ICC) January 30, 2024
కివీస్‌ను ఆది నుంచే భారత బౌలర్లు దెబ్బతీశారు. నమన్ తివారి (1-19), రాజ్ లింబాని (2-17) ఆరంభంలో తమ పేస్‌తో కివీస్‌ను కోలుకోనీయకుండా చేశారు. ఆ తర్వాత స్పిన్నర్ సౌమి పాండే.. పది ఓవర్లు వేసి రెండు మెయిడిన్లతో 19 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ముషీర్ ఖాన్.. బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 3.1 ఓవర్లు వేసిన అతడు.. పది పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అర్షిన్ కులకర్ణి ఒక వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో భారత్ సూపర్ సిక్స్ స్టేజ్‌లో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 2న నేపాల్‌తో ఆడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

