T20 Rankings | ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ర్యాంకులు మెరుగయ్యాయి. జింబాబ్వే పర్యటన అనంతరం టీమిండియా ఓపెనింగ్ జోడి ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. టీ20 బ్యాటర్స్ ర్యాకింగ్స్లో యశస్వి నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. జింబాబ్వే పర్యనటలో జట్టు కెప్టన్‌గా వ్యవహరించిన శుభ్‌మన్ గిల్ 37వ స్థానానికి చేరాడు. ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ 844 పాయింట్లతో టీ20 నెంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు. టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ మూడు, పాక్ బ్యాటర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ నాలుగు ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక భారత బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఆరు స్థానంలో ఉన్నాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ ఒక స్థానం దిగజారి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు.
జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో గిల్, యశస్వి బ్యాటింగ్‌తో రాణించి.. సిరీస్‌లో టాప్ స్కోరర్లుగా నిలిచారు. గిల్ ఐదు మ్యాచ్‌ల్లో 125.93 స్ట్రయిక్ రేట్‌తో 170 పరుగులు చేయగా.. మూడు మ్యాచుల్లో యశస్వీ జైస్వాల్.. అద్భుతంగా రాణించాడు. జైస్వాల్ నాలుగో టీ20లో 93 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన యశస్వి మూడు మ్యాచ్‌ల్లో మొత్తం 141 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌ను భారత జట్టు 4-1తో కైవసం చేసుకున్నది. ఇక జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 11 స్థానాలు మెరుగుపడి 44వ స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో వాషింగ్టన్ సుందర్ 46వ స్థానానికి, ముఖేష్ కుమార్ 73వ స్థానానికి చేరుకున్నారు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ప్రపంచ టాప్ టీ20 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఒక స్థానం మెరుగుపడి మూడో స్థానానికి చేరాడు. ఇక ఆల్ రౌండ్ల ర్యాకింగ్స్లో శ్రీలంక ఆటగాడు హసరంగ అగ్రస్థానంలో ఉండగా.. హర్దిక్ పాండ్యా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.