ICC : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 పోటీలకు సమయం దగ్గరపడుతోంది. ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ కోసం ఇప్పటికే పలు జట్లు సన్నాహక మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వరల్డ్ కప్ వామప్ మ్యాచ్‌లకు వేదికలను ప్రకటించింది. ప్రారంభోత్సవానికి ముందు జరగుబోయే ఈ మ్యాచ్‌ల కోసం గురువారం ఐసీసీ మూడు మైదానాలను ఎంపిక చేసింది. ఇంగ్లండ్‌లోని కార్డిఫ్స్ గార్డెన్, డెర్బీ కౌంటీ గ్రౌండ్ లగ్బొరో యూనివర్సిటీలో ప్రపంచ కప్ వామప్ గేమ్స్ జరుగుతాయని ఐసీసీ తెలిపింది.
‘విశ్వ వేదికపై మహిళా క్రికెటర్లు రాణించడంతో ఈ మూడు మైదానాల పాత్ర ఎంతో ఉంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు స్థానిక అభిమానులకు అంతర్జాతీయ క్రికెటర్ల ఆటను ప్రత్యక్ష్యంగా చూసే అవకాశం కలగనుంది’ అని ఐసీసీ ప్రకటనలో తెలిపింది.
Three venues confirmed to host warm-up matches at ICC Women’s #T20WorldCup 2026 in England and Wales 🏟️
Details ➡️ https://t.co/SpHA4kvzBz pic.twitter.com/f3Kq14UGbU
— ICC (@ICC) July 10, 2025
ఇంగ్లండ్ వేదికగా 2026 జూన్ 12 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ జరుగనుంది. 24రోజుల పాటు అభిమానులను అలరించే ఈ టోర్నీలో పన్నెండు జట్లు ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. మొత్తంగా ర్నీని ఇంగ్లండ్, వేల్స్‌లోని ఏడు వేదికలపై 33 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. లార్డ్స్ మైదానలో జూలై 5న ఫైనల్ ఉంటుంది. ఇప్పటికే ప్రపంచ్ కప్ పోటీలకు 8 జట్లు అర్హత సాధించాయి. వచ్చే ఏడాది క్వాలిఫయర్‌లో టాప్ -4లో నిలిచిన జట్లు మిగిలిన నాలుగు బెర్తులు దక్కించుకుంటాయి.