ముంబై: మహిళల వన్డే వరల్డ్‌కప్(Womens Cricket World Cup)కు చెందిన కొత్త షెడ్యూల్‌ను ఇవాళ అంతర్జాతీయ క్రికెట్ మండలి రిలీజ్ చేసింది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం అందుబాటులో లేని కారణంగా.. అక్కడ జరిగే మ్యాచ్‌లను నవీ ముంబై స్టేడియానికి మార్చేశారు. దీంతో జరిగిన షెడ్యూల్ మార్పును ఇవాళ ప్రకటించారు. సెప్టెంబర్‌లో ప్రారంభం అయ్యే వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నవీ ముంబైలో ఉన్న డీవై పాటిల్ స్టేడియంలో మొత్తం అయిదు మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంట్లో మూడు లీగ్ మ్యాచ్‌లు, ఓ సెమీ ఫైనల్ , ఆ తర్వాత నవంబర్ 2వ తేదీన ఫైనల్ మ్యాచ్ కూడా జరగనున్నది.
The updated match schedule for #CWC25 is out now 🏆
All the action starts on 30 September! 🗓️
✍️: https://t.co/jBoQOHox5V pic.twitter.com/RcErcJR6yU
— ICC (@ICC) August 22, 2025
సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు జరిగే టోర్నీ తేదీల్లో మార్పు లేదు. కానీ వేదికలు, మ్యాచ్‌ల తేదీలను మాత్రం మార్చేశారు. గౌహతిలోని ఏసీఏ స్టేడియం, ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం, విశాఖపట్టణంలోని వీడీసీఏ స్టేడియం, కొలంబలోని ప్రేమదాస స్టేడియంలో మహిళల వరల్డ్‌కప్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. మహిళల క్రికెట్‌కు నవీ ముంబై వేదిక ఆదర్శవంతంగా ఉంటుందని ఐసీసీ చైర్మెన్ జేషా తెలిపారు.
UPDATE – #TeamIndia‘s revised schedule confirmed for ICC Women’s Cricket World Cup.#WomenInBlue #CWC25 pic.twitter.com/aQm8VjgzWV
— BCCI Women (@BCCIWomen) August 22, 2025
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను నవంబర్ రెండో తేదీన కొలంబో లేదా నవీ ముంబైలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. తొలి సెమీస్‌ను గౌహతి లేదా కొలంబో, రెండో సెమీస్‌ను నవీ ముంబైలో నిర్వహించనున్నారు. ఫస్ట్ సెమీస్ అక్టోబర్ 29, రెండో సెమీస్‌ను అక్టోబర్ 30న నిర్వహించనున్నారు.