ICC Pitch Ratings : ఈమధ్యే ముగిసిన అండరన్స్ – టెండూల్కర్ ట్రోఫీలో వికెట్ బ్యాటర్లకే అనుకూలించడం గమనించాం. ‘బజ్ బాల్’ (Bazz Ball) ఆటకు తగ్గట్టు బ్యాటర్లకు ఉపకరించే పిచ్‌లు రూపొందించడం చూసి క్యూరేటర్స్పై మండిపడ్డారు మాజీ ఆటగాళ్లు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సైతం ఐదు టెస్టులు జరిగిన పిచ్‌లకు రేటింగ్స్ ఇచ్చింది. ఇందులో ఒకే ఒకటి బాగుందని తెలిపింది. భారత్, ఇంగ్లండ్ జట్లు తొలి టెస్టు ఆడిన లీడ్స్ వికెట్ (Leeds Wicket) మాత్రమే ‘చాలా బెస్ట్’ అని ఐసీసీ వెల్లడించింది. మిగతా నాలుగు పిచ్‌లు పర్లేదని రేటింగ్స్ ఇచ్చింది.
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీకి వేదికైన ఐదు పిచ్‌లకు శుక్రవారం ఐసీసీ రేటింగ్స్ ప్రకటించింది. లీడ్స్‌లోని హెడింగ్లేలో జరిగిన తొలి టెస్టు వికెట్ చాలా బాగుందని, ఔట్ ఫీల్డ్ కూడా చక్కగా ఉందని ఐసీసీ తెలిపింది. బర్మింగ్హమ్లోని ఎడ్జ్‌బాస్టన్ పిచ్ సంతృప్తికరంగానే ఉందని, ఔట్‌ఫీల్డ్ చాలా బెటర్‌గా ఉందని చెప్పింది. లార్డ్స్ పిచ్ సంతృప్తికరంగానే ఉందని చెప్పిన ఐసీసీ ఔట్‌ఫీల్డ్‌కు ‘వెరీ గుడ్’ రేటింగ్ ఇచ్చింది. మాంచెస్టర్ పిచ్‌కు కూడా పర్లేదని.. ఔట్‌ఫీల్డ్ కూడా బాగుందని తెలిపింది ఐసీసీ. చివరిదైన ఓవల్ వికెట్‌కు మాత్రం ఐసీసీ ఇంకా రేటింగ్స్ ఇవ్వాల్సి ఉంది.
ICC Pitch Rating for INDIA VS England TEST SERIES REVEALS
Pitch and Outfield Ratings for the Anderson–Tendulkar Trophy
1st Test – Headingley, Leeds
Pitch: Very Good | Outfield: Very Good2nd Test – Edgbaston, Birmingham
Pitch: Satisfactory | Outfield: Very Good3rd Test –…
— Sporttify (@sporttify) August 8, 2025
ఐసీసీ 2023 వరకూ పిచ్‌లకు ఆరు విధాల రేటింగ్స్ ఇచ్చేది. ‘చాలా బాగుంది’, ‘బాగుంది’, ‘సాధారణం’, ‘సాధారణం కంటే తక్కువ’, ‘అధ్వానం’, ‘అసలెంత మాత్రం పనికిరాదు’.. అని రేటింగ్స్ ఇస్తూ ఉండేది. అయితే.. రెండేళ్ల నుంచి ‘చాలా బాగుంది’, ‘సంతృప్తికరంగా ఉంది’, ‘సంతృప్తికరంగా లేదు’, ‘ఆటకు పనికి రాదు’ అని నాలుగు రకాల రేటింగ్స్‌ను ప్రకటిస్తోంది.
బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్‌లు రూపొందించడం ఇంగ్లండ్ బోర్డకు పరిపాటి. భారత జట్టును కూడా ఇలానే దెబ్బతీయాలనుకున్నారు ఇంగ్లండ్ క్యూరేటర్లు. చివరిదైన ఓవల్ టెస్టుకు మాత్రం పచ్చికతో కూడిన బౌన్సీ పిచ్ రూపొందించారు. కానీ, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా సంచలన ఆటతో సిరీస్ సమం చేసింది. ఇంగ్లీష్ ఆటగాళ్లకు దీటుగా ఆడుతూ భారత క్రికెటర్లు సైతం శతకాల మోత మోగించారు.
నిర్ణయాత్మక ఓవల్ టెస్టులో సిరాజ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దాంతో, తొలిసారి ఇరుదేశాల దిగ్గజాల పేరుతో నిర్వహించిన అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీని 2-2తో సిరీస్ పంచుకున్నాయి భారత్, ఇంగ్లండ్.