టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకొస్తున్నాడు. ఇంగ్లండ్‌పై సెంచరీతో చెలరేగిన సూర్య.. తాజాగా వెస్టిండీస్ పర్యటనలో ఓపెనర్ అవతారం ఎత్తాడు. మూడో టీ20లో రోహిత్ గాయంతో మైదానం వీడటంతో జట్టును గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న అతను అద్భుతంగా రాణించాడు. కేవలం 44 బంతుల్లోనే 75 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఈ క్రమంలో టీ20ల్లో తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఏకంగా 816 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. అగ్రస్థానంలో ఉన్న బాబర్ ఆజమ్ (818 పాయింట్లు)తో పోలిస్తే సూర్య కేవలం రెండు పాయిట్లు తక్కువగా ఉన్నాడు. వెస్టిండీస్‌తో మరో రెండు టీ20లు ఆడనున్న నేపథ్యంలో.. మరుసటి ర్యాకింగ్స్లో బాబర్‌ను సూర్య అధిగమించినా ఆశ్చర్యం లేదు.
ఐసీసీ విడుదల చేసిన టీ20 బ్యాటర్ల జాబితాలో వీళ్లిద్దరి తర్వాత మూడో స్థానంలో పాక్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. నాలుగో స్థానంలో సౌతాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ ఉన్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ ఐదో స్థానంలో నిలిచాడు.
🔹 Suryakumar's rapid rise
🔹 Hosein makes big gains
🔹 Markram breaks into the top 🔟Some big movements in the @MRFWorldwide ICC Men's T20I Player Rankings 📈
— ICC (@ICC) August 3, 2022