టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ మొన్ననే ముగిసిపోయింది. యూఏఈ ఈ టోర్నీకి అతిథ్యం ఇచ్చింది. దుబాయ్, షార్జా, అబుదబీలలో ఉన్న స్టేడియాలు.. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వేదికలయ్యాయి. మొత్తానికి 16 టీమ్స్ నుంచి ఒక్క టీమ్ ఆస్ట్రేలియా విజేతగా నిలిచి తొలిసారి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది.
2022లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియానే అతిథ్యం ఇవ్వనుంది. 2023 టీ20 వరల్డ్ కప్‌కు ఇండియా అతిథ్యం ఇవ్వనుంది.
ఆ తర్వాత 2024 నుంచి 2031 వరకు జరగనున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్స్, అతిథ్య నగరాలను ఐసీసీ తాజాగా ప్రకటించింది.
అయితే.. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌కు అతిథ్యం ఇవ్వని యూఎస్ఏ.. 2024 ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌కు అతిథ్యం ఇవ్వనుంది. వెస్టిండీస్‌తో కలిసి యూఎస్ఏ 2024 వరల్డ్ కప్‌కు హోస్ట్‌గా వ్యవహరించనుంది.
ఫిబ్రవరి 2025లో ఐసీసీ మెన్స్ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. 1996 తర్వాత పాకిస్థాన్ అతిథ్యం ఇవ్వబోయే మొదటి అంతర్జాతీయ టోర్నమెంట్. 1996లో ఇండియా, శ్రీలంకతో పాటు పాకిస్థాన్.. ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌కు ఆతిథ్యం అందించింది.
2026లో భారత్, శ్రీలంక.. మెన్స్ టీ20 వరల్డ్ కప్‌కు అతిథ్యం అందించనున్నాయి. అక్టోబర్, నవంబర్ 2027లో నమీబియాతో కలిసి జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా కలిసి క్రికెట్ వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కలిసి టీ20 వరల్డ్ కప్‌కు అతిథ్యం ఇవ్వనున్నాయి. 12 నెలల తర్వాత అంటే అక్టోబర్ 2029లో చాంపియన్ ట్రోఫీని ఇండియా హోస్ట్ చేయనుంది.
2030లో టీ20 వరల్డ్ కప్ హోస్టింగ్‌ను ఐర్లాండ్, స్కాట్లాండ్తో కలిసి ఇంగ్లండ్ హోస్ట్ చేయనుంది. ఇక ఫైనల్ షెడ్యూల్ ఈవెంట్ ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌ను అక్టోబర్ లేదా నవంబర్ 2031లో ఇండియా, బంగ్లాదేశ్ కలిసి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
2024-2031 Tournament host summary
Host/s | Date | Comp |
West Indies & USA | June 2024 | ICC Men’s T20 World Cup |
Pakistan | February 2025 | ICC Men’s Champions Trophy |
India & Sri Lanka | February 2026 | ICC Men’s T20 World Cup |
South Africa, Zimbabwe & Namibia | October/November 2027 | ICC Men’s Cricket World Cup |
Australia & New Zealand | October 2028 | ICC Men’s T20 World Cup |
India | October 2029 | ICC Men’s Champions Trophy |
England, Ireland & Scotland | June 2030 | ICC Men’s T20 World Cup |
India & Bangladesh | October/November 2031 | ICC Men’s Cricket World Cup |
Are you ready for the best-ever decade of men’s white-ball cricket?
— ICC (@ICC) November 16, 2021
Eight new tournaments announced 🔥
14 different host nations confirmed 🌏
Champions Trophy officially returns 🙌https://t.co/OkZ2vOpvVQ pic.twitter.com/uwQHnna92F
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rahul on World Cup | ప్రపంచకప్ మీద ఫోకస్ ఉంది.. కానీ ప్రతి సిరీస్ ముఖ్యమే: రాహుల్
టీ20 ప్రపంచకప్ గెలిచారంటూ న్యూజిల్యాండ్‌కు కంగ్రాట్స్ చెప్పిన మిశ్రా.. ట్రోలింగ్‌తో ట్వీట్ డిలీట్
David Warner | కొన్నిసార్లు సూర్యుడు ఆలస్యంగా ఉదయిస్తాడంతే.. వార్నర్‌పై మాజీ క్రికెటర్ కామెంట్