అహ్మదాబాద్: ప్రతి వరల్డ్ కప్ టోర్నీకి ముందు రోజు సంప్రదాయబద్ధంగా నిర్వహించే కెప్టెన్స్ డే ఈవెంట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ (GCA) క్లబ్ హౌస్‌కు చెందిన బాంక్వెట్ హాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో పార్టిసిపేట్ చేస్తున్న 10 జట్ల కెప్టెన్లు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
పురుషుల క్రికెట్ ప్రపంచకప్-2023 గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగా జరగాల్సిన కెప్టెన్స్ డే ఈవెంట్‌ను ఇవాళ నిర్వహిస్తున్నారు. అంతేగా ఇవాళ రాత్రి ఏడు గంటలకు క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఈ ప్రారంభోత్సవాల్లో బాలీవుడ్‌కు చెందని పలువురు సెలెబ్రిటీలు పాల్గొని క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించనున్నారు.