Wanindu Hasaranga | రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న వెంటనే షాకిచ్చిన ఐసీసీ.. హసరంగ కావాలనే ఫూల్ చేశాడా..?
Wanindu Hasaranga | గతేడాది టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ మంగళవారమే ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్న లంక స్పిన్నర్ వనిందు హసరంగకు ఐసీసీ షాకిచ్చింది. ఈ స్పిన్నర్‌పై ఐసీసీ.. రెండు టెస్టు మ్యాచ్‌ల నిషేధం విధించడంతో...
Wanindu Hasaranga | గతేడాది టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ మంగళవారమే ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్న లంక స్పిన్నర్ వనిందు హసరంగకు ఐసీసీ షాకిచ్చింది. టెస్టులలో తిరిగి బరిలోకి దిగేందుకు సిద్ధమైన అతడిని శ్రీలంక జట్టు.. ఈనెల 22 నుంచి బంగ్లాదేశ్‌తో మొదలుకాబోయే టెస్టు సిరీస్‌లో సభ్యుడిగా చేర్చింది. తుది జట్టులో కూడా ఉండనుండే ఈ స్పిన్నర్‌పై ఐసీసీ.. రెండు టెస్టు మ్యాచ్‌ల నిషేధం విధించడంతో కంగుతినడం అతడి వంతైంది. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో అతడి దురుసు ప్రవర్తనే ఇందకు కారణం.
బంగ్లాదేశ్‌తో ఇటీవలే ముగిసిన మూడో వన్డేలో భాగంగా హసరంగ.. 37వ ఓవర్లో అంపైర్ నుంచి క్యాప్ అందుకునేప్పుడు దురుసుగా ప్రవర్తించాడు. అతడి నుంచి క్యాప్ లాక్కుని అసహనం వ్యక్తం చేస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం హసరంగకు షాక్ తప్పలేదు. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించిన ఐసీసీ.. మూడు డీమెరిట్ పాయింట్లు కూడా విధించింది. అంతకుముందే అతడు అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో ముగిసిన టీ20 సిరీస్‌లో అంపైర్ల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా రెండు మ్యాచ్‌ల నిషేధంతో పాటు ఐదు డీమెరిట్ పాయింట్లు కూడా ఉన్నాయి.
ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 7.6 ప్రకారం 8 డీమెరిట్ పాయింట్లు అంటే నాలుగు సస్పెన్షన్ పాయింట్లు. మ్యాచ్‌ల ప్రకారం చూస్తే టెస్టులు అయితే రెండు మ్యాచ్‌లు, వన్డేలు, టీ20లు అయితే నాలుగు మ్యాచ్‌లలో నిషేధం విధించే అవకాశం ఉంది. హసరంగ టెస్టు రీఎంట్రీ ఇవ్వడంతోనే ఐసీసీ అతడిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది.
కావాలనే చేశాడా..?
హసరంగ టెస్టు రిటైర్మెంట్ బ్యాక్ తీసుకున్న కొద్ది క్షణాలకే ఐసీసీ నిషేధం విధించిన నేపథ్యంలో అతడు కావాలనే ఇలా చేశాడన్న వాదనలు వినపడుతున్నాయి. లంక ఇప్పట్లో టీ20లు ఆడేది లేదు. ఒకవేళ వైట్ బాల్ క్రికెట్లో నాలుగు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కోవాలంటే వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో అతడికి షాక్ తప్పేది కాదు. ఇది లంకకు పెద్ద తలనొప్పే. అందుకే రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని ఆ నిషేధాన్ని టెస్టు మ్యాచ్‌ల మీద తోసేశాడని, హసరంగ ఇది కావాలనే చేశాడని విశ్లేషకులు చెబుతున్నారు.
HASARANGA will retire from Tests after series against Bangladesh 😂#ICC #WaninduHasaranga pic.twitter.com/1wCWc1Hx7F
— Filtercricket (@filter_cricket) March 19, 2024
ఐపీఎల్‌కు వస్తాడా..?
హసరంగపై నిషేధం పడటంతో ఇకపై అతడు బంగ్లాదేశ్‌లో లంకతో ఉన్నా దానితో అతడికి గానీ జట్టుకు గానీ ఒనగూరేదేమీ లేదు. ఈ నేపథ్యంలో అతడు ఐపీఎల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరతాడా…? అన్నది ఆసక్తికరంగా మారింది. టెస్టు సిరీస్ కారణంగా అతడు ఏప్రిల్ 4 వరకూ జట్టుతో కలిసే అవకాశం లేని పరిస్థితులు ఉండగా తాజాగా ఐసీసీ నిషేధంతో అతడు తన నిర్ణయాన్ని ఏమైనా మార్చుకుంటాడేమో చూడాలి…!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

