ICC : మహిళల వన్డే వరల్డ్ కప్ సన్నాహక వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా(Australia)కు భారత జట్టు భారీ ఓటమిని రుచి చూపించింది. ఏకంగా102 పరుగుల తేడాతో గెలుపొందిన హర్మన్‌ప్రీత్ సేన ఆసీస్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అసలే పరాజయం బాధలో ఉన్న కంగారూ జట్టుకు మరో షాక్ తగిలింది. రెండో వన్డేలో ఐసీసీ నిబంధనలను పాటించకపోవడంతో మ్యాచ్ ఫీజులో కోత విధించింది. ముల్లన్‌పూర్‌లో సెప్టెంబర్ 17న ఆసీస్ టీమ్ స్లో ఓవర్ రేటు (Slow Over Rate) నమోదు చేసింది. దాంతో, 10శాతం మ్యాచ్ డబ్బులను కట్ చేయనుంది.
రెండో వన్డేలో మొదట భారత్ బ్యాటింగ్ చేయగా నిర్ణీత సమయానికి ఆస్ట్రేలియా ఓటర్ల కోటాను పూర్తి చేయలేదు. 48 ఓవర్లు మాత్రమే వేసింది. దాంతో.. ఈ విషయమై రిఫరీ ఫిర్యాదు చేయగా ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హేలీ తమ నేరాన్ని అంగీకరించింది. ఐసీసీ నియమావళి 2.2 ప్రకారం కేటాయించిన సమయం లోపు ఓవర్ల కోటా పూర్తి చేయాలి. లేదంటే ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి మ్యాచ్ ఫీజులో 5 శాతం కోల్పోతారు. అదే.. రెండు ఓవర్లు ఆలస్యమైతే ఏకంగా పది శాతం డబ్బును ఐసీసీకి చెల్లించాల్సి ఉంటుంది.
Australia have been fined for maintaining a slow over-rate in the second ODI against India.#INDvAUShttps://t.co/EdbX7vgu4t
— ICC (@ICC) September 19, 2025
మూడు వన్డేల సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా చెరొక మ్యాచ్ గెలుపొందాయి. తొలి వన్డేలో ఆసీస్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో స్మృతి మంధాన మెరుపు శతకంతో టీమిండియా భారీ తేడాతో జయభేరి మోగించింది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో మ్యాచ్ సెప్టెంబర్ 20 శనివారం నాడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనుంది. సెప్టెంబర్ 30 నుంచి సొంతగడ్డపై వరల్డ్ కప్ ప్రారంభం కానున్నందున విజయంతో టోర్నీలో అడుగుపెట్టాలని హర్మన్‌ప్రీత్ సేన భావిస్తోంది.