PCB | దుబాయ్/కరాచీ: చాంపియన్స్ ట్రోఫీ(2025) నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. హైబ్రిడ్ మోడల్ విషయంలో ఐసీసీ అల్టిమేటంకు ఒకింత వెనుకకు తగ్గిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పలు డిమాండ్లు ముందుపెట్టింది. ఓవైపు హైబ్రిడ్ పద్ధతికి ఓకే అంటూనే వచ్చే మూడేండ్లు భారత్లో జరిగే ఐసీసీ టోర్నీలకు ఇదే పద్ధతి వర్తింపజేయాలని షరతులు పెట్టింది. శనివారం చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పీసీబీ చీఫ్ మోహిసిన్ నక్వీ స్పంది స్తూ ‘ టోర్నీ నిర్వహణపై నేను అతిగా మాట్లాడాను.
అలా చేస్తే పరిస్థితులు ఇంకా క్లిష్టంగా మారుతాయి. మేము మా ప్రతిపాదనలు ఐసీసీ ముందు ఉంచాం, భారత్ కూడా వారి సిఫార్సులు చెప్పింది. ఏ నిర్ణయం తీసుకున్నా..అది అందరికీ సమానంగా ఉండాలి. అంతిమంగా క్రికెట్ గెలువాలన్నదే మా తపన అదే సమయ ంలో పాకిస్థాన్ ఆత్మగౌరవం కూడా ముఖ్యమే’ అని అన్నాడు. దీనికి తోడు వార్షిక ఆదాయ వాటాలను కూ డా ఐసీసీ పెంచాలని పీసీబీ డిమాండ్ చేస్తున్నది.