దుబాయ్: ఐసీసీకి వచ్చే ఆదాయంలో 38 శాతం బీసీసీఐకి ఇవ్వడం సబబేనని ఐసీసీ సీఈఓ రిచర్డ్ గౌల్డ్ అన్నాడు. ఐసీసీకి వచ్చే ఆదాయంలో చాలా భాగం బీసీసీఐ వల్లే సమకూరుతున్నదని, అందువల్ల 38 శాతం ఆదాయం బీసీసీఐకి ఇవ్వడం సముచితమని గౌల్డ్ తెలిపాడు.
రానున్న నాలుగేళ్లలో ఐసీసీ 600 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందనున్నది.