తెలుగు యూనివర్సిటీ, సెప్టెంబర్ 2: మాలలపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న వివక్షకు నిరసనగా డిసెంబర్ నెలలో 30 లక్షల మంది మాలలతో ‘చలో హైదరాబా ద్’ పేరిట మాలల యుద్దభేరి కార్యక్రమం నిర్వహిస్తామని మాల సంఘాల జేఏసీ వెల్లడించింది. తెలంగాణలోని మాల విద్యార్థులు, ఉద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్న జీవో 99ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌రెడ్డిపైనే ఈ యుద్ధభేరి మోగిస్తామని హెచ్చరించింది. హైదరాబాద్‌లోని అంబేద్కర్ రిసోర్స్ సెంటర్లో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్, గ్రేటర్ కమిటీ చైర్మన్ బేర బాలకిషన్ (బాలన్న), గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్ వెల్లడించారు.
జీవోనంబర్ 99ను రద్దుచేస్తూ గ్రూప్-3లో ఉన్న 26 మాల ఉపకులాలకు 20లోపు రెండు రోస్టర్ పాయింట్లు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం మెడలు వంచి రోస్టర్ విధానాన్ని సవరిం చి 26 ఉపకులాలకు రెండు రోస్టర్ పా యింట్లు సాధించేందుకు రాజీలేని పోరా టం సాగించాలని పిలుపునిచ్చారు. రోస్టర్ విధానాన్ని సవరించేలా గ్రామస్థాయిలో జేఏసీ నాయకులు ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు వినతిపత్రాలు అందించాలని సూచించారు. ఈ నెల 7 నుంచి జరుగనున్న శాసనసభ, మండలిలో చర్చించేలా మాల ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు.