Ayodhya Ram Temple | రామ మందిరం తొలి సీఈవోగా జితేంద్ర.. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటన
అయోధ్య రామ మందిరం తొలి చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్(సీఈవో)గా మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బుధవారం ఆమోదించింది. దేవరియాకు చెందిన మిశ్రా ఆపరేషన్ సిందూర్ సమయంలో వెస్టర్న్ ఎయిర్ కమాండ్ అధిపతిగా ఉన్నారు.
- ఆపరేషన్ సిందూర్‌లో వెస్టర్న్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా పనిచేసిన మిశ్రా
అయోధ్య, సెప్టెంబర్ 2 : అయోధ్య రామ మందిరం తొలి చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్(సీఈవో)గా మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బుధవారం ఆమోదించింది. దేవరియాకు చెందిన మిశ్రా ఆపరేషన్ సిందూర్ సమయంలో వెస్టర్న్ ఎయిర్ కమాండ్ అధిపతిగా ఉన్నారు. రామ మందిరంలో విరాళాల చోరీ జరిగినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన మూడవ సమావేశాన్ని బుధవారం నిర్వహించింది. ఈ సందర్భంగా ముగ్గురు కొత్త ట్రస్టీలను ట్రస్ట్ ప్రకటించింది. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు.
ఢిల్లీకి చెందిన మహేష్ భాగ్చంద్కా, అయోధ్య న్యాయవాది మదన్ మోహన్ పాండే, ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న షికోహాబాద్‌కు చెందిన నిర్మలా యాదవ్ ట్రస్టీలుగా నియమితులయ్యారు. విశ్వ హిందూ పరిషద్(వీహెచ్‌పీ) మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్‌కు బంధువైన మహేష్ భాగ్చంద్కా 2020లో రామ మందిర భూమిపూజ సందర్భంగా నిర్వహించిన ధార్మిక కార్యక్రమంలో ఆయన ప్రధాన యజమానిగా వ్యవహరించారు. 2024 జనవరి 22న రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో కూడా ఆయన యజమానిగా వ్యవహరించారు. దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు ఈ కొత్త బాధ్యతను స్వీకరించేలా ప్రేరణ ఇచ్చిందని జితేంద్ర మిశ్రా(రిటైర్డ్) అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

