సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 2 : ధూప దీప నైవేద్య అర్చకుల గౌరవ భృతిని రూ. 25 వేలకు పెంచాలని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవా రం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధూప దీప నైవేద్యం పథకం ప్రారంభంలో రూ. 2,500 మాత్రమే ఉండేదని, అర్చకుల సేవలను గుర్తించిన అప్పటి సీఎం కేసీఆర్ రూ.10 వేలకు పెంచారని, అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. అర్చకులకు అర్చ క వెల్ఫేర్ బోర్డులో స్థానం కల్పించడం వల్ల రూ.4 లక్షల గ్రాట్యుటీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం గౌరవ భృతి రూ. 25వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.