ICC : ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ క్రికెటర్ల తీరుపై విచారణ చేపట్టిన ఐసీసీ (ICC) కీలక నిర్ణయాలు తీసుకుంది. క్రికెట్ మైదానంలో రెచ్చగొట్టే చేష్టలు, రాజకీయ అంశాలను ప్రస్తావించడాన్ని ఏమాత్రం సహించమని స్పష్టం చేసింది. భారత్, పాకిస్థాన్ మధ్య తొలి లీగ్ దశ మ్యాచ్‌లో రెచ్చగొట్టే సంజ్ఞలు చేసినందుకుగానూ పేసర్ హ్యారిస్ రవుఫ్ (Haris Rauf)పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. ఐసీసీ నియమావళిని ఉల్లఘించినందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా వేసింది.
ఆసియా కప్‌లో లీగ్ దశలో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాతో షేక్ హ్యాండ్ చేసేందుకు నిరాకరించాడు. ఇక బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు భారత ప్రేక్షకులు హ్యారిస్ రవుఫ్‌ను ‘కోహ్లీ.. కోహ్లీ’ అని ఆటపట్టించారు. అందుకు అతడు విమానాల్ని కూల్చివేసినట్టుగా సంజ్ఞలు చేశాడు. అంతేకాదు ఆరు జెట్లను కూల్చాం అని చేతివేళ్లను చూపిస్తూ భారత క్రికెటర్లనే కాదు అభిమానులను రెచ్చగొట్టాడు.
🚨BANNED🚨
Haris Rauf has been banned for 2 ODIs by the ICC.
The Pakistan pacer collected four demerit points during the Asia Cup matches against India. pic.twitter.com/mKAtA0QyXs
— Cricbuzz (@cricbuzz) November 4, 2025
అనంతరం పాక్ ఇన్నింగ్స్‌లో అర్ధశతకం తర్వాత ఓపెనర్ ఫర్హాన్ ‘గన్ సెలబ్రేషన్’ చేసుకున్నాడు. వీరి చర్యలను తీవ్రంగా పరిగణించిన భారత బోర్డు రిఫరీకి ఫిర్యాదు చేసింది. అయితే.. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ పహల్గాం మృతులకు విజాయన్ని అంకితమివ్వడం, భారత సైనికుల పరాక్రమాన్ని కొనియడడంపై పాక్ బోర్డు అభ్యంతరం తెలిపింది. తమ సారథితో కరచాలనం చేయకపోగా.. రాజకీయ వ్యాఖ్యలు చేశాడని సూర్యపై ఫిర్యాదు చేసింది. అయితే.. టోర్నీ సమయంలో గొడవను పెద్దది చేయడం ఇష్టంలేక తాత్కాలికంగా హెచ్చరికలతో సరిపుచ్చింది ఐసీసీ. తాజాగా ఇరుదేశాల బోర్డుల ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఐసీసీ నియమావళిని ఉల్లంఘించినందుకు కఠిన చర్యలు తీసుకుంది.
పీసీబీ, బీసీసీఐ పరస్పర ఫిర్యాదులపై ఐసీసీ ఎలైట్ ప్యానెలలోని రిఫరీలు స్టడీ చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల(సెప్టెంబర్ 14, సెప్టెంబర్ 21, ఫైనల్ సెప్టెంబర్ 28) సమయంలో రెచ్చగొట్టేలా ఆటగాళ్లు చేసిన చర్యలను విశ్లేషించారు.
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ నియామావళిలోని ఆర్టికల్ 2.21ను ఉల్లంఘించాడు. క్రికెట్ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించినందుకు అతడికి మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది. అంతేకాదు రెండు డీమెరిట్ పాయింట్లను కేటాయించింది.
ICC announced the outcomes of the official hearings regarding India vs Pakistan matches during the Asia Cup.👀👉
Arshdeep Singh was found not guilty, while Haris Rauf’s total reached four demerit points within a 24-month period, resulting in two suspension points under the ICC’s… pic.twitter.com/V2Ck4OViJH
— OneCricket (@OneCricketApp) November 4, 2025
గన్ సెలబ్రేషన్ చేసుకున్న పాక్ ఓపెనర్ ఫర్హాన్ రిఫరీ విచారణలో తన తప్పును అంగీకరించాడు. కాబట్టి మరోసారి అలాంటి రెచ్చగొట్టే సెలబ్రేషన్ చేయవద్దని అతడిని హెచ్చరించిన ఐసీసీ.. ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.
భారత అభిమానులు, క్రికెటర్లను రెచ్చగొట్టేలా సంజ్జలు చేసినందుకు హ్యారిస్ రవుఫ్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది ఐసీసీ. అలానే రెండు డీ మెరిట్ పాయింట్లు కేటాయించింది.
ఫీల్డింగ్ సమయంలో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అసభ్యకర సంకేతం చేశాడని ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. కానీ, అతడు ఐసీసీ నియామావళిలోని ఆర్టికల్ 2.6ను అతిక్రమించినట్టుగా రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ భావించలేదు. సో.. అర్ష్‌దీప్‌పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. చర్యలూ తీసుకోలేదు.
Arshdeep Singh survives without any punishment on his response to Harish Rauf in Asia Cup. pic.twitter.com/WTq0uehk5w
— abhay singh (@abhaysingh_13) November 4, 2025
ఆసియా కప్ ఫైనల్లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆర్టికల్ 2.21ను ఉల్లంఘించాడు. పాక్ పేసర్ హ్యారిస్ రవుఫ్‌ను బౌల్డ్ చేశాక విమానాన్ని కూల్చినట్టు బుమ్రా సంజ్ఞలు చేశాడు. ఈ విషయంపై విచారణలో తన తప్పును అంగీకరించాడు బుమ్రా. అందుకని అతడికి ఒక డీమెరిట్ పాయింట్ విధించింది ఐసీసీ.
🚨🚨 Asia Cup: Haris Rauf received a total of 4 demerit points and has been suspended for the first and second ODI against South Africa.
Bumrah also received one demerit point for doing this 👇pic.twitter.com/ZTfmslXzgw
— The Impact Desk 🇮🇳 (@TheImpactDesk) November 4, 2025
ఫైనల్లో పాక్ బౌలర్ హ్యారిస్ రవుఫ్ ఆర్టికల్ 2.21ను అతిక్రమించాడని రిఫరీ రిచీ రిచర్డ్సన్ గుర్తించారు. అందుకని అతడికి మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత పడింది. అలానే రెండు డీ మెరిట్ పాయింట్లు వచ్చాయి.