Andy Pycropt : ఆసియా కప్ లీగ్ దశలో తలపడిన భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి బిగ్ ఫైట్‌కు సిద్ధమవుతున్నాయి. గ్రూప్ ఏ నుంచి సూపర్ 4 చేరుకున్న దాయాదులు సెప్టెంబర్ 21 ఆదివారం దుబాయ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ‘హ్యాండ్ షేక్’ వివాదం రాజుకున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు రిఫరీగా ఎవరు వ్యవహరిస్తారు? అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఐసీసీ మాత్రం లీగ్ దశలో చిరకాల ప్రత్యర్థుల గేమ్‌కు రిఫరీగా ఉన్న ఆండీ పైక్రాఫ్ట్(Andy Pycropt)ను ఎంపిక చేసింది.
పైక్రాఫ్ట్ నియామకంపై ఎలాంటి రాద్ధాంతం చేయొద్దని శనివారం పాక్ బోర్డుకు స్పష్టం చేసింది అత్యున్నత క్రికెట్ మండలి. ‘తన ప్రమేయం లేని సంఘటన కారణంగా మ్యాచ్ రిఫరీ విశ్వసనీయత, నిబద్ధతను ప్రశ్నించలేం. కరచాలనం వివాదంతో ఆండీ పైక్రాఫ్ట్‌కు మాత్రం సంబంధం లేదు. అందుకే అతడినే కొనసాగిస్తున్నాం. ముందుగా నిర్ణయించినట్టుగానే దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లకు ఆండీ.. అబూదాబీలో జరిగే మ్యాచ్‌లకు రిచర్డ్సన్ రిఫరీగా వ్యవహరిస్తారు’ అని ఐసీసీ వెల్లడించింది. ఇప్పటికే రెండు సార్లు ఆండీని రిఫరీగా తప్పించాని చూసి భంగపడిన పీసీబీకి ఇది జీర్ణంకాకపోవచ్చు.
🚨 REPORTS 🚨
Andy Pycroft is set to be the match referee for the India vs Pakistan Super 4 match tomorrow. 🏆⚔️#Cricket #India #Pakistan #AsiaCup pic.twitter.com/gglaf0kxAB
— Sportskeeda (@Sportskeeda) September 20, 2025
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ జట్లు తొలిసారి ఆసియా కప్‌లో ఎదురుపడ్డాయి. ఎప్పటిలానే దాయాదిని చిత్తుగా ఓడించిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు జట్టు సభ్యులకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దాంతో.. ఈ వ్యవహారాన్ని పెద్ద రాద్దాంతం చేసింది పాక్ క్రికెట్ బోర్డు. టాస్ సమయంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చొరవ చూపకపోవడం వల్లనే టీమిండియా కెప్టెన్ సూర్య.. తమ నాయకుడు సల్మాన్ అఘాతో కరచాలనం చేయలేదని దుయ్యబట్టింది.
𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐬𝐮𝐩𝐫𝐞𝐦𝐚𝐜𝐲 𝐨𝐯𝐞𝐫 𝐏𝐚𝐤𝐢𝐬𝐭𝐚𝐧 𝐢𝐧 𝐦𝐚𝐣𝐨𝐫 𝐦𝐚𝐭𝐜𝐡𝐞𝐬 𝐜𝐨𝐧𝐭𝐢𝐧𝐮𝐞𝐬. 🇮🇳🔥#INDvsPAK #AsiaCup #Cricket #Sportskeeda pic.twitter.com/xSvH3pXfsI
— Sportskeeda (@Sportskeeda) September 15, 2025
వచ్చే మ్యాచ్‌కు తమకు కొత్త రిఫరీని కేటాయించుకుంటే తమ జట్టు టోర్నీ నుంచి వైదొలుగుతుందని ఆ దేశ బోర్డు బీరాలు పలికింది. కానీ, ఐసీసీ మాత్రం మీ ఇష్టం. ఆడితే ఆడండి లేకుంటే లేదు.. రిఫరీ ఆండీని మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దాంతో.. యూఈఏతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని భావించిన పాక్.. టాస్ వేళకు మైదానం చేరుకోలేదు. మరోసారి ఐసీసీకి లేఖ రాసి తమకు వేరే రిఫరీని కేటాయించాలని కోరింది. అయినా సరే అస్సలు కుదరదని జై షా నేతృత్వంలోని ఐసీసీ కరాఖండీగా చెప్పేసింది. దాంతో.. చేసేదేమీ లేక ఉసూరుమంటూ అబుదాబీ స్టేడియం చేరుకుంది పాక్ జట్టు.