సింగపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) గురువారం సింగపూర్లో జరుగనుంది. ఇటీవలి కాలంలో జోరుగా చర్చ సాగుతున్న ‘టూ టైర్ టెస్ట్ సిస్టమ్’తో పాటు టీ20 ప్రపంచకప్లో జట్ల పెంపునకు సంబంధించిన అంశాలపై కీలకంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది.
ఐసీసీ చైర్మన్ జై షా ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నాడు. కాగా, ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్ (2025-27)లో రెండంచెల టెస్టు విధానం సాధ్యం కాకపోయినప్పటికీ 2027 తర్వాత దీనిని అమలుచేసేందుకు గల సాధ్యాసాధ్యాలను ఏజీఎంలో చర్చించనున్నట్టు సమాచారం.