ICC : వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం(నవంబర్ 19) మధ్యాహ్నం భారత్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మోగా టోర్నీలో స్టార్ ఆటగాళ్లు దంచికొట్టగా.. కొందరుబౌలర్లు బంతితో ఇరగదీశారు. రేపటితో టోర్నీ ముగియనున్న నేపథ్యంలో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు నామినీస్ పేర్లను శనివారం ఐసీసీ వెల్లడించింది. నామినేట్ అయిన తొమ్మిది మందిలో నలుగురు భారత క్రికెటర్లు ఉండడం విశేషం.
వరల్డ్ కప్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలు పోటీ పడుతున్నారు. ఆడం జంపా(ఆస్ట్రేలియా), గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా), క్వింటన్ డికాక్(దక్షిణాఫ్రికా), రచిన్
Your time to decide! 📩
Cast your vote now for the Fans’ Player of the Tournament in #CWC23 🌟⬇️https://t.co/eiTLVMY7gF
— ICC (@ICC) November 18, 2023
రవీంద్ర(న్యూజిలాండ్), డారిల్ మిచెల్(న్యూజిలాండ్)లు నామినేట్ అయ్యారు. విజేతను నిర్ణయిచేందుకు ఐసీసీ ఓటింగ్ నిర్వహించనుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన క్రికెటర్‌ను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ప్రకటించనుంది. 2019 ఎడిషన్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు గెలిచాడు.