T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్(Pakistan) తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. ఎనిమిదో సీజన్ రన్నరప్ అయిన బాబర్ ఆజాం(Babar Azam) సేన విజయంతో టోర్నీ ఆరంభించాలనే కసితో ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) తీపి కబురు చెప్పింది. ఆ జట్టు ఆటగాళ్లకు స్టేడియానికి సమీపంలోని హోట్‌లో బస ఏర్పాటు చేసింది. గ్రూప్ ‘ఏ’ లో ఉన్న పాక్.. మెగా టోర్నీ తొలి పోరులో గురువారం అమెరికాతో తలపడనుంది.
ప్రపంచ కప్ కోసం న్యూయార్క్ చేరుకున్న పాక్ జట్టుకు స్టేడియానికి దూరంగా ఉన్న హోటల్లో బస ఏర్పాటు చేసింది. వాళ్లు ప్రాక్టీస్ కోసం స్టేడియం వెళ్లాలంటే కనీసం గంటన్నర పట్టేది. దాంతో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) ఈ విషయమై ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. ‘భారత జట్టుకేనా సకల సౌకర్యాలు. ఇతర జట్లను పట్టించుకోరా?’ అని ఐసీసీ తీరును తప్పుపట్టాడు. దాంతో, ఎట్టకేలకు దిగొచ్చిన
Our first match of the tournament. It begins today! 🏏
🏟️ Grand Prairie Stadium, Dallas
🆚 USA 🇺🇸
⏰ 08:30 PM PKT#USAvPAK | #WeHaveWeWill | #T20WorldCup pic.twitter.com/NA7dIait60— Pakistan Cricket (@TheRealPCB) June 6, 2024
ఐసీసీ పాక్ టీమ్‌కు న్యూయార్క్ స్టేడియం దగ్గర్లోని హోటల్‌ను కేటాయించింది. ఇప్పుడు ఐదంటే ఐదు నిమిషాల్లోనే బాబర్ ఆజాం బృందం మైదానానికి చేరుకునే వీలుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్(Team India), పాక్ జట్లు జూన్ 9న ఎదురుపడనున్నాయి. న్యూయార్క్‌లోని నిస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దాయాదుల ఫైట్ జరుగనుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న విషయం తెలిసిందే.