లండన్: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన టెస్టు రిటైర్మెంట్పై తొలిసారి స్పందించాడు. ‘యూ వీ కెన్’ ఫౌండేషన్ నిధుల సమీకరణ కోసం దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు.
‘రెండు రోజుల క్రితం గడ్డానికి రంగు వేసుకున్నాను. ప్రతీ నాలుగు రోజులకోసారి గడ్డానికి కలర్ వేసుకోవాల్సి వస్తుందంటేనే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు’ అని అన్నాడు. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ సరిగ్గా రెండు నెలల క్రితం కోహ్లీ.. టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.