Hardik Pandya : కొత్త ఏడాదిలో వరల్డ్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాని టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. శ్రీలంక సిరీస్‌కు ముందు మీడియా సమావేశంలో హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. నా కెరీర్లో ఇంతవరకూ ఏమీ సాధించలేదు. ఈ ఏడాది నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. వన్డే వరల్డ్ కప్ గెలవడం. మేము మెగా టోర్నీలో శాయశక్తులా పోరాడతాం. కచ్చితంగా ట్రోఫీ అందుకుంటామనే నమ్మకం ఉంది అని హార్ధిక్ తెలిపాడు. అతని సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది.
పోయిన ఏడాది గాయంతో మైదానం వీడిన హార్ధిక్ పునరాగమనం తర్వాత అద్భుతంగా ఆడుతున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్లో అతని కెప్టెన్సీలోని గుజరాత్ టైటన్స్ విజేతగా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో హార్ధిక్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుని గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 34 పరుగులు చేసి, బౌలింగ్‌లో 3 కీలక వికెట్లు తీశాడు. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా ఎంపికయ్యాడు. పాండ్యా నేతృత్వంలోని యువ భారత్ న్యూజిలాండ్‌లో టీ20 సిరీస్ గెలిచింది. దాంతో, శ్రీలంక సిరీస్‌కు కూడా సెలక్టర్లు అతడినే కెప్టెన్ చేశారు. 2023 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. 20 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసింది