ఇస్లామాబాద్: క్రికెట్లో ఎంత గొప్ప ప్లేయర్స్ అయినా.. కొందరు కెప్టెన్‌గా, మరికొందరు కోచ్‌గా విఫలమవుతుంటారు. ఆ బాధ్యతలను తీసుకోవడానికి చాలా మంది ముందుకు రారు. అందుకే ఎంతో మంది లెజెండరీ ప్లేయర్స్ రిటైర్మెంట్ తర్వాత కోచ్‌లుగా కనిపించరు. ఇప్పుడు పాకిస్థాన్ మాజీ వసీం అక్రమ్ కూడా తాను నేషనల్ టీమ్‌కు కోచ్ ఎందుకు కాలేదో చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ సహా పలు లీగ్స్‌లో ఫ్రాంచైజీలకు కోచ్‌గా చేసినా.. ఇప్పటి వరకూ పాక్ నేషనల్ టీమ్‌కు మాత్రం కోచింగ్ ఇవ్వలేదు. అలా ఎందుకు అని ప్రశ్నిస్తే.. ఎవరైనా తిడితే తాను సహించలేనని అతడు సమాధానమిచ్చాడు.
టీమ్ ఓడిపోతే కొందరు అభిమానులు దారుణంగా వ్యవహరిస్తారు. సోషల్ మీడియాలో హద్దులు మీరుతుంటారు. అది సహించడం నా వల్ల కాదు. ఫీల్డ్‌లో ఆడేది ప్లేయర్స్ తప్ప కోచ్ కాదు. ఆ విషయం ఫ్యాన్స్ గుర్తుంచుకోవాలి. ఇలాంటి ఘటనలు ఇతర దేశాల్లో నేను చూడలేదు అని అక్రమ్ అన్నాడు. ఇక ఫుల్‌టైమ్ కోచ్‌గా ఉంటే ఏడాదికి 200 నుంచి 250 రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అది కూడా నా వల్ల కాదు అని అక్రమ్ చెప్పాడు. ఈ మధ్యే పాకిస్థాన్ కోచ్ పదవి నుంచి మిస్బావుల్ హక్‌తోపాటు వకార్ యూనిస్ తప్పుకున్న విషయం తెలిసిందే.