హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఉస్మానియా యూనివర్సిటీ అంతర కాలేజీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో యువ స్ప్రింటర్ అగసర నందిని బెస్ట్ అథ్లెట్‌గా నిలిచింది. సోమవారం జరిగిన మహిళల 100మీటర్ల హార్డిల్స్ ఈవెంట్‌తో పాటు జావెలిన్ త్రో, హైజంప్ విభాగాల్లో నందిని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.
పురుషుల కేటగిరీలో బీజేఆర్ కాలేజీకి చెందిన అజారుద్దీన్ బెస్ట్ అథ్లెట్‌గా నిలిచాడు. టీమ్ చాంపియన్‌షిప్‌లో లయోల కాలేజీ 31 పాయింట్లతో టాప్‌లో నిలువగా, నిజాం కాలేజీ(27)రెండో స్థానం దక్కించుకుంది. మహిళల టీమ్ విభాగంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ 66 పాయింట్లతో అగ్రస్థానం సొంతం చేసుకుంది.