హైదరాబాద్, ఆట ప్రతినిధి: రష్యా తైక్వాండో ఓపెన్లో రాష్ట్ర యువ ప్లేయర్ బోడె సాయిదీపక్కు నిరాశ ఎదురైంది. సోమవారం జరిగిన పురుషుల 68కిలోల బౌట్లో దీపక్ 9-21 తేడాతో బ్రెజిల్ జాతీయ చాంపియన్ నికోలస్ చేతిలో పోరాడి ఓడాడు. ఒలింపిక్స్ బెర్తు లక్ష్యంగా తొలిసారి టోర్నీ బరిలోకి దిగిన దీపక్..అంచనాలకు మించి రాణించాడు. త్వరలో జరిగే అల్బేనియా ఓపెన్లో సత్తాచాటుతానని దీపక్ ధీమా వ్యక్తం చేశాడు.