New Zealand | వెల్లింగ్టన్: మరికొద్దిరోజుల్లో వెస్టిండీస్/అమెరికా వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్ బోర్డు జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టును కేన్ విలియమ్సన్ నడిపించనుండగా స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తిరిగి జాతీయ జట్టుతో చేరాడు.
విలియమ్సన్కు ఇది ఆరో టీ20 ప్రపంచకప్ కాగా సారథిగా నాలుగోది. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో సమతూకంగా ఉన్న కివీస్.. ప్రపంచకప్ గ్రూప్ దశలో వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియా, అఫ్గానిస్థాన్‌తో ఆడనుంది.
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అలెన్, బౌల్ట్, బ్రాస్‌వెల్, చాప్మన్, కాన్వే, ఫెర్గూసన్, హెన్రీ, మిచెల్, నీషమ్, ఫిలిప్స్, రచిన్, శాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ