హైదరాబాద్, ఆట ప్రతినిధి : రంజీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడుతున్న హైదరాబాద్ బౌలింగ్‌లో దారుణంగా తేలిపోయింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-డీ మ్యాచ్ రెండో రోజు.. ఢిల్లీ బ్యాటర్లలో సనత్ సాంగ్వాన్ (211 నాటౌట్), అయుష్ దొసెజా (209) ద్విశతకాలతో రెచ్చిపోవడంతో ఆ జట్టు 529/4 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. హైదరాబాద్ బౌలర్లలో మిలింద్ (3/57) మినహా మిగిలినవారంతా భారీగా పరుగులిచ్చుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన హైదరాబాద్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 77/1తో నిలిచింది. తన్మయ్ (27*), అనికేత్ (11*) క్రీజులో ఉన్నారు.
తమిళనాడుతో కోయంబత్తూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో జార్ఖండ్ సారథి ఇషాన్ కిషన్ (173) భారీ శతకాన్ని నమోదుచేశాడు. తద్వారా ఆ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 419 పరుగుల స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట చివరికి తమిళనాడు.. 11 ఓవర్లలో 18 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జతిన్ పాండే (3/10), సాహిల్ (2/8) తమిళనాడు బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు.