హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాదీ యువ జిమ్నాస్ట్ నిషిక అగర్వాల్ పూణెలో జరిగిన నేషనల్ చాంపియన్‌షిప్స్‌లో మూడు పతకాలతో సత్తా చాటింది. గత నెల 25 నుంచి మే 3 దాకా జరిగిన టోర్నీలో నిషిక.. మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక రజతం గెలుచుకుంది. ‘వాల్టింగ్ టేబుల్’ ఈవెంట్లో 12.883 స్కోరుతో స్వర్ణం సొంతం చేసుకున్న ఆమె ‘బ్యాలెన్సింగ్ బీమ్’లో 10.967 స్కోరుతో రజతంతో మెరిసింది.
‘ఫ్లోర్ ఎక్సర్సైజ్’ ఈవెంట్లోనూ 11.43 స్కోరు సాధించిన నిషిక పసిడి సొంతం చేసుకుంది. అన్ఈవెన్ బార్స్‌లో నిషిక (9.20 స్కోరు).. కొద్దిపాటి తేడాతో కాంస్యం కోల్పోయింది. మహారాష్ట్ర క్రీడాకారిణి అనుష్క (9.43) మూడో స్థానంతో పతకం సాధించింది.