హైదరాబాద్, ఆట ప్రతినిధి: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో హైదరాబాద్‌కు చెందిన ఎడ్ల సృజన..ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపికైంది. నగరానికే చెందిన వికెట్‌కీపర్, బ్యాటర్ మమత గాయంతో వైదొలుగడంతో ఆమె స్థానంలో సృజనను జట్టులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం వడోదరాలో జరుగుతున్న లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మిగతా మ్యాచ్‌లకు సృజన అందుబాటులో ఉండనుంది. ఇన్ని రోజులు రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న ఈ 20 యువ మీడియం పేసర్ తనకు దక్కిన చాన్స్‌పై సంతోషం వ్యక్తం చేసింది. తుది జట్టులో అవకాశం వస్తే కచ్చితంగా సత్తాచాటుతానని ధీమా వ్యక్తం చేసింది.