అహ్మదాబాద్ : విజయ్‌హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ ఖాతాలో నాలుగో విజయం చేరింది. ఆదివారం అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత తనయ్ త్యాగరాజన్(5/32) ధాటికి అరుణాచల్‌ప్రదేశ్ 28.3 ఓవర్లలో 96 పరుగులకు కుప్పకూలింది. సిద్దార్థ్(29), ధృవ్సోనీ(20) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. తనయ్ స్పిన్ ధాటికి అరుణాచల్‌ప్రదేశ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్ 12 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. నితేశ్‌రెడ్డి(29 నాటౌట్) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఐదు వికెట్లు తీసిన తనయ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. మరోవైపు విజయ్ హజారే టోర్నీలో గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, విదర్భ, బరోడా నేరుగా క్వార్టర్స్ బెర్తు దక్కించుకున్నాయి.