Hyderabad | డెహ్రాడూన్: హైదరాబాద్, ఉత్తరాఖండ్ మధ్య రంజీ గ్రూపు-బీ పోరు రసవత్తరంగా సాగుతున్నది. రాహుల్ రాదేశ్(82 నాటౌట్), హిమతేజ(78) అర్ధసెంచరీలతో చెలరేగడంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 244 పరుగులు చేసింది. మిడిలార్డర్లో రాదేశ్, హిమతేజ ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓవర్‌నైట్ స్కోరు 313/8తో తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఉత్తరాఖండ్ 325 పరుగులకు ఆలౌటైంది. తనయ్ త్యాగరాజన్ (4/85) నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.