హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాజస్థాన్‌తో శనివారం మొదలైన రంజీ గ్రూపు-డీ పోరులో హైదరాబాద్ మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ తొలి ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్(6), అభిరాత్రెడ్డి(9) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరుగగా, రాహుల్ రాధేశ్(85 నాటౌట్), కెప్టెన్ రాహుల్‌సింగ్(55) అర్ధసెంచరీలతో రాణించారు. ముఖ్యంగా రాధేశ్..రాజస్థాన్ బౌలర్లను నిలువరిస్తూ తన ఇన్నింగ్స్‌లో 8ఫోర్లతో ఆకట్టుకున్నాడు. రాధేశ్తో పాటు త్యాగరాజన్(5 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. అనికేత్(2/35), అశోక్(2/61) రెండేసి వికెట్లు తీశారు.