హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 8 నుంచి 18 వరకు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వేదికగా 11 రోజుల పాటు ఈ లీగ్ జరగనుందని ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది.
ఈ లీగ్‌లో మొత్తం 6 ఫ్రాంచైజీ జట్లు తలపడనున్నాయి. భారత్‌కు చెందిన స్టార్ ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్, ఓజాస్ దియోతాలే, జ్యోతి సురేఖ, అభిషేక్ వర్మలతో పాటు పలువురు ఒలింపిక్, ప్రపంచ చాంపియన్లు పోటీ పడతారు.