పుదుచ్చేరి: బౌలర్లు రాణించడంతో పుదుచ్చేరితో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 435 రన్స్ చేసిన ఆ జట్టు.. 34 ఓవర్లలోనే ప్రత్యర్థి జట్టుకు చెందిన 8 వికెట్లను పడగొట్టి పైచేయి సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పుదుచ్చేరి మూడో రోజు ఆట ముగిసే సమయానికి 92/8 స్కోరు చేసింది. ఇంకా ఆ జట్టు 343 పరుగులు వెనుకబడి ఉంది. పున్నయ్య (3/10), త్యాగరాజన్ (2/41) పుదుచ్చేరి బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టారు.
ఈ రంజీ సీజన్‌కు ముందు ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన పృథ్వీ షా.. రికార్డు ద్విశతకంతో సత్తాచాటాడు. చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షా.. 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. తద్వారా రంజీ ట్రోఫీ చరిత్రలో మూడో వేగవంతమైన ద్విశతకం చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు రవిశాస్త్రి (123 బంతుల్లో), తన్మయ్ అగర్వాల్ (119 బంతుల్లో) పేరిట ఉంది. చండీగఢ్‌తో మ్యాచ్‌లో 72 బంతుల్లోనే మూడంకెల స్కోరు సాధించిన షాకు ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇది 14వ సెంచరీ.