కోల్కతా : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుస విజయాలతో దూకుడుమీదున్న హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడింది. ఎలైట్ గ్రూప్-బీలో భాగంగా తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్.. 4 వికెట్ల తేడాతో చండీగఢ్ చేతి ఓటమిపాలైంది.
మొదట బ్యాటింగ్ చేసి న హైదరాబాద్.. 20 ఓవర్లకు 146/8కే పరిమితమైంది. ఛేదనను చండీగఢ్.. 19.5 ఓవర్లలో పూర్తిచేసింది.