హైదరాబాద్, ఆట ప్రతినిధి: బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగనున్న అండర్-19 క్రికెట్ శిక్షణా శిబిరానికి ఏడుగురు మహిళా క్రికెటర్లు ఎంపికయ్యారు. హైదరాబాద్ నుంచి ఒకేసారి ఇంతమంది ఎంపిక కావడం ఇదే తొలిసారి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి నిధి, పార్వతి, హన్సిక, సంధ్య, జాజ్మిన్, కావ్యశ్రీ, సృజన ఉన్నారు. వీరంతా ఈనెల 25 నుంచి మే 21 వరకు జరిగే శిబిరాల్లో పాల్గొననున్నారు. ఇందులో మెరుగైన ప్రదర్శన కనబరిచే వారిని పరిగణనలోకి తీసుకోనున్నారు.