Hyderabad | జైపూర్: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్‌లో రాజస్థాన్‌తో కీలక మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 261/5తో రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఆ జట్టులో వికెట్ కీపర్ రాహుల్ రాధేశ్ (100) శతకంతో మెరవగా లోయరార్డర్ బ్యాటర్లు మిలింద్ (48), తన్మయ్ (22) అతడికి అండగా నిలిచారు.
రాజస్థాన్ బౌలర్లలో అజయ్ సింగ్‌కు ఐదు (5/139) వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 117/1 స్కోరు చేసింది.