జైపూర్:ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీలో హైదరాబాద్‌కు నిరాశ ఎదురైంది. జైపూర్‌లో శుక్రవారం జరిగిన పోరులో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో హర్యానాను చిత్తుచేసింది. హర్యానా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో హైదరాబాద్ 15.4 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. అయితే పాయింట్ల పరంగా ముంబై, బరోడాతో కలిసి 24 పాయింట్లతో హైదరాబాద్ సమంగా నిలిచినప్పటికీ రన్‌రేట్ పరంగా వెనుకంజలో ఉండటంతో క్వార్టర్స్‌కు అర్హత సాధించలేకపోయింది.