
బాలానగర్, జనవరి 31 : ఫతేనగర్ డివిజన్లో ఫ్లైఓవర్ రెండోలైన్, ఆర్యూబీ పనులను చేపట్టాలని కోరుతూ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్లు వినతిపత్రం అందజేశారు. సోమవారం కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని డివిజన్ల వారిగా సమస్యలపై సమీక్ష సమావేశానికి వారు హాజరయ్యారు.