TCA | హైదరాబాద్, ఆట ప్రతినిధి : బీసీసీఐ ఆదేశాల మేరకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)కు సంబంధించి అంశాలు అర్థం చేసుకోవడం, వాటి పరిష్కారానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఏడుగురు సభ్యులతో సబ్‌కమిటీ ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు మేనేజర్, ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించిన దేవరాజ్, దిలీప్‌కు హెచ్‌సీఏ చెరో 10 లక్షల నజరానా ప్రకటించింది.