హైదరాబాద్, ఆట ప్రతినిధి : ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 2-3(15-9, 15-7, 9-15, 11-5, 8-15)తో అహ్మదాబాద్ డిఫెండర్స్ చేతిలో ఓటమిపాలైంది. టోర్నీలో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌కు ఇది వరుసగా మూడో ఓటమి.
మ్యాచ్‌లో తొలుత ఆధిపత్యం ప్రదర్శించిన హైదరాబాద్ రెండు సెట్లు గెలిచి మంచి జోరు మీద కనిపించింది. అయితే మూడో సెట్ నుంచి అనూహ్యంగా పుంజుకున్న అహ్మదాబాద్..బ్లాక్హాక్స్ను దీటుగా నిలువరించింది. బత్సురి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.