హైదరాబాద్, ఆటప్రతినిధి: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీలో హైదరాబాద్ ఐదో విజయం నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన పోరులో హైదరాబాద్ 23 పరుగుల తేడాతో ముంబైని చిత్తుచేసింది. మొదట హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 రన్స్ చేసింది. తన్మయ్ అగర్వాల్ (59), రాహుల్ సింగ్ (37) రాణించారు. లక్ష్య ఛేదనలో ముంబై 8 వికెట్లకు 132 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రహానే (24), యశస్వి జైస్వాల్ (16), శివమ్ దూబే (2), సర్ఫరాజ్ ఖాన్ (2) విఫలమయ్యారు. మన బౌలర్లలో రవితేజకు 4 వికెట్లు దక్కాయి.