West Indies Central Contracts: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్లు నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్, కైల్ మేయర్స్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అందజేసే కాంట్రాక్టులు అవసరం లేదని తేల్చి చెప్పారు. కాంట్రాక్టులను తిరస్కరించిన పూరన్, హోల్డర్, మేయర్లు వచ్చే ఏడాది అమెరికాతో పాటు స్వదేశంలో జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్‌కు మాత్రం అందుబాటులో ఉంటామని బోర్డుకు తెలియజేశారు. ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడే ఈ స్టార్ ప్లేయర్లు.. దేశానికంటే లీగ్ క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు.
డిసెంబర్ 10న క్రికెట్ వెస్టిండీస్ సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. పురుషుల క్రికెట్లో 14 మంది, మహిళల క్రికెట్లో 15 మందికి కాంట్రాక్టులను అందజేసింది. పురుషుల క్రికెట్లో గుడకేశ్ మోటీ, కీసీ కార్టీ, తేజ్‌నారాయణ్ చందర్‌పాల్, అలిక్ అథనాజ్లు కొత్తగా కాంట్రాక్టులను దక్కించుకోగా మహిళల జాబితాలో జైడా జేమ్స్, గ్రిమ్మండ్లకూ అవకాశం దక్కింది.
West Indies’ former captains Nicholas Pooran and Jason Holder – along with Kyle Mayers – have declined the offer of central contracts
They will be available for selection for all T20Is though pic.twitter.com/aBENMoaJOr
— ESPNcricinfo (@ESPNcricinfo) December 10, 2023
కాంట్రాక్టులను తిరస్కరించిన వారిలో హోల్డర్, పూరన్‌లు ఆ జట్టుకు సారథులుగా కూడా పనిచేసిన విషయం తెలిసిందే. హోల్డర్ మూడు ఫార్మాట్లకు సారథిగా పనిచేశాడు. హోల్టర్ చివరిసారి స్వదేశంలో భారత్‌తో ఆడిన సిరీస్‌తో పాటు స్కాట్లాండ్ సిరీస్‌లో పాల్గొన్నాడు. పూరన్ ఇంతవరకూ టెస్టు క్రికెట్ ఆడకపోయినా పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం అతడు స్టార్ ప్లేయరే. మూడు ఫార్మాట్లలో ఆడే మేయర్స్ పరిమిత ఓవర్లకే అధిక ప్రాధాన్యమిస్తున్నాడు. ఈ ముగ్గురూ ప్రపంచ క్రికెట్లో ఎక్కడ ఫ్రాంచైజీ లీగ్ జరిగినా తమ ఫ్రాంచైజీల తరఫున ఆడుతున్నారు. లీగ్ క్రికెట్లో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ఈ క్రికెటర్లు.. దేశం తరఫున టీ20లకు మాత్రమే అందుబాటులో ఉంటామని చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.