FIH Pro League : ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐహెచ్ ప్రో- లీగ్(FIH Pro League) 2023-24 కోసం హాకీ ఇండియా(Hockey India) పటిష్ఠమైన స్క్వాడ్‌ను ప్రకటించింది. భువనేశ్వర్, రూర్కెలాలో జరిగే ఈ టోర్నీ కోసం 24 మందితో కూడిన పురుషుల బృందాన్ని ఎంపిక చేసింది. ఇద్దరు గోల్ కీపర్లు, ఏడుగురు డిఫెండర్లు, ఎనిమిది మంది మిడ్ ఫీల్డర్లు, ఏడుగురు ఫార్వర్డ్స్తో కూడిన స్క్వాడ్‌ను గురువారం వెల్లడించింది.
హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా, హార్దిక్ సింగ్ వైస్ కెప్టెన్‌గా ఉన్న ఈ బృందంలో అరిజీత్ సింగ్ హుందాల్, విష్ణుకాంత్ సింగ్‌లు చోట దక్కించుకున్నారు. ఈ లీగ్‌లో టీమిండియా బలమైన స్పెయిన్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌తో తలపడనుంది. పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో నెదర్లాండ్స్‌కు చెందిన హెర్మస్ క్రూయిస్(Herman Kruis)ను ఈమధ్యే హై పర్మార్మెన్స్ కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే
🔴 SQUAD ANNOUNCEMENT 🔴
Here’s our India Men’s Team for the Bhubaneswar and Rourkela leg of the FIH Pro League 2023/24. 🇮🇳
India will face Spain, Netherlands, Australia and Ireland.
Stay tuned for more updates from the FIH Pro League!🏑
Details you don’t want to miss:… pic.twitter.com/n8XUWT2Mqq
— Hockey India (@TheHockeyIndia) February 1, 2024
గోల్ కీపర్లు : శ్రీజేష్ పరట్టు రవీంద్రన్, కృష్ణన్ బహదూర్ పాఠక్.
డిఫెండర్లు : జర్మన్‌ప్రీత్ సింగ్, సుమిత్, జుగ్రాజ్ సింగ్, అమిత్ రొహిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), వరుణ్ కుమార్, సంజయ్, విష్ణుకాంత్ సింగ్.
మిడ్‌ఫీల్డర్లు : హార్దిక్ సింగ్(వైస్ కెప్టెన్), వివేక్ సాగర్ ప్రసాద్, మన్‌ప్రీత్ సింగ్, నీలకంఠ శర్మ, షంషేర్ సింగ్, రాజ్‌కుమార్ పాల్, రవిచంద్ర సింగ్.
ఫార్వర్డ్స్ : లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మందీప్ సింగ్, గుర్జంత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, అభిషేక్, ఆకాశ్‌దీప్ సింగ్, అరైజీత్ సింగ్.
తొలి ఎడిషన్‌లో భువనేశ్వర్‌లో ఫిబ్రవరి 10 నుంచి 16వ తేదీ వరకు మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన స్పెయిన్‌ను ఢీకొట్టనుంది. అనంతరం ఫిబ్రవరి 19 నుంచి రూర్కెలా వేదికగా టోర్నీ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 25న ఫైనల్ మ్యాచ్ ఉండనుంది.